CM Chandrababu: ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ కొనసాగుతోంది.. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్ కొనసాగుతోంది.. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గిరిజన హక్కులకు కట్టుబడి ఉన్నామని.. 1/70 చట్టాన్ని రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు..
Read Also: Ponnam Prabhakar: సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదు!
గిరిజనుల అస్తిత్వం కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడు కోవడమే.. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నంబర్ 3 తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగాలు, గిరిజనులకు ఇచ్చేలా చేశాం అన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ జీవో రద్దైంది.. మళ్లీ ఆ జీవో తెచ్చే ప్రయత్నం చేస్తాం.. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు అన్ని హక్కులూ ఉండాలన్న 1/70 జీవో మార్చే ఉద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చారు..
Read Also: RC 16: క్రికెట్ విత్ కుస్తీ.. టైటిల్ వేటలో యూనిట్
ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టిన సీఎం చంద్రబాబు.. “గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం…1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు.. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యింది. దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తాము. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని… అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నాము.” అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం…1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు.
గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం.…
— N Chandrababu Naidu (@ncbn) February 11, 2025