గిరిజన హక్కులకు కట్టుబడి ఉన్నామని.. 1/70 చట్టాన్ని రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. గిరిజనుల అస్తిత్వం కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడు కోవడమే.. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నంబర్ 3 తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగాలు, గిరిజనులకు ఇచ్చేలా చేశాం అన్నారు సీఎం చంద్రబాబు..
యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. గిరిజనులు ఆందోళన చెoదవద్దు అని విజ్ఞప్తి చేశారు..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్ కొనసాగుతోంది..