CM Chandrababu: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. మేం ఎలా మద్దతిస్తాం..?
- ఉప రాష్ట్రపతి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని క్లారిటీ..
- తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే పెట్టాలి..
- అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుంది..
- మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ సమిష్టిగా సీపీ రాధాకృష్ణన్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. సీపీ రాధాకృష్ణన్ ను కలిసి మా మామద్దతు ఉంటుందని, అభినందనలు తెలిపాం అన్నారు.. ఇక, దేశం గౌరవించదగ్గ వ్యక్తి సీపీ రాధాకృష్ణన్ అని వ్యాఖ్యానించారు.. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తీసుకొస్తారని ఆకాక్షించారు..
Read Also: Telangana Jobs : మరోసారి ఆరోగ్యశాఖలో ఉద్యోగాల జాతర.. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ
Also Read
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది.. ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.. తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని సలహా ఇచ్చారు.. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.. అసలు మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..? అని ప్రశ్నించారు.. ఆ రోజుల్లో పీవీ నరసింహారావు కోసం కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నా.. మేం త్యాగం చేశామని గుర్తుచేసుకున్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణలోని కందుకూరు మండలం ఆకులమైలారానికి చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసిన విషయం విదితమే.. ఏపీ, తెలంగాణలోని అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.. కానీ, ఏపీలోని పాలక, ప్రతిపక్షాలు మొత్తం ఎన్డీఏకే మద్దతు ప్రకటించాయి..
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!