తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది.. ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.. తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని సలహా ఇచ్చారు.. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.. అసలు మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..? అని ప్రశ్నించారు..
ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతుగా నిలిచింది వైసీపీ.. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంభందాన్ని గుర్తుకు తెచ్చినట్లేనని ఆ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో అమ్మ్ ఆద్మీ పార్టీ పనితీరును ఆదర్శంగా తీసుకుని పని చేయాలని పిలుపునివ్వడం ఆశ్చర్యానికి గుర్తు చేసింది. రాజమండ్రిలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమాయత్తా సమావేశంలో పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోన్న సమయంలో.. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. దోవల్ పేరును పరిశీలిస్తోంది..