AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. లిక్కర్ కేసు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కౌంటర్లు, సుపరిపాలన – తొలి అడుగుపై చర్చించింది మంత్రివర్గం.. మొత్తంగా 42 అజెండా అంశాలపై కేబినెట్‌లో చర్చ సాగింది.. ఎల్ఆర్ఎస్‌కు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు సంబంధించి చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. నాలా చట్ట సవరణకు సంబంధించి చర్చించి.. ఆమోదం తెలిపారు.. ఇక, పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.. రెండు కొత్త పాలసీలకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి.. ఆ తర్వాత ఆమోదముద్ర వేశారు..
Read Also: Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
మరోవైపు, మంత్రుల పనితీరుపై కేబినెట్‌లో చర్చించారు.. గ్రీన్ హైడ్రోజెన్ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. నవంబర్‌లో 8 క్వి.. బిట్ క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరించనున్నట్టు కేబినెట్‌లో తెలియజేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. దేశంలోనే తొలిసారి అమరావతిలో ఇది ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.. ఇక, వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో.. విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.. అందుకు నేషనల్ క్వాంటం మిషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..