Andhra Pradesh weather: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. 7.5కి.మీ వరకు అల్పపీడనం వ్యాపించింది. ఛత్తీస్‌ఘడ్ మీదుగా ద్రోణి, మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. వచ్చే రెండు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గరిష్టంగా 60కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
READ MORE: Supreme Court: “హైకోర్టు తప్పు చేసింది”.. యాక్టర్ దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు..
ఇదిలా ఉండగా.. భారీ వర్షాలు కురిస్తాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. నీరు, కరెంటు రెండూ కలిస్తే ప్రమాదం ఉంది. టీవీ, ఫ్రిజ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్‌ని తీసేయండి. లేదంటే విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు వరదలపై అవగాహన ఉండదు. అయితే ఇంట్లోకి వర్షపు నీరు వచ్చే అవకాశం ఉన్నట్లయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా మంచిది. ఆహారం, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీటిని చూసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే.. ఎంతైనా సంపాదించుకోవచ్చు. రోడ్డుపై వర్షం కురుస్తున్నప్పుడు ప్రయాణం ప్రమాదకరం.
READ MORE: Kingdom : ఏపీలో కింగ్‌డమ్ టికెట్ రేట్లు హైక్.. ఎంతంటే?