AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
- ఆపరేషన్ సిందూర్‌ను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం..
- ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు..
- ఏపీ రాజధాని అమరావతి అని కేబినెట్ తీర్మానం..
- కేబినెట్ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనున్న ఏపీ ప్రభుత్వం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆపరేషన్ సిందూర్‌ను అభినందిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది.. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది కేబినెట్.. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.. ఇక, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చసాగగా.. తీరప్రాంత భద్రత, రక్షణరంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు.. మరోవైపు, ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.. అంటే, ఏపీ రాజధాని అమరావతి అని కేబినెట్ తీర్మానం తీసింది.. కేబినెట్ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనుంది ఏపీ ప్రభుత్వం ..
Read Also: Rohit Sharma: అంతా చెత్త.. భారత్ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ ఏపీ టూర్ లో ప్రధాన వేదిక పై సీటింగ్ ఏర్పాటు పై మంత్రి వర్గంలో చర్చకు వచ్చిందట.. కేంద్ర మంత్రులను ఒక వైపు.. ఏపీ మంత్రులను మరోపక్క కూర్చునేల ప్రోటోకాల్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్న సీఎం చంద్రబాబు. తన పక్కన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్నారు.. మరోసారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు..
Read Also: PBKS vs MI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధర్మశాల టు అహ్మదాబాద్!
ఇక, జలవనరుల శాఖ లో కంపెనీల చట్టం కింద జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.. చెరువుల్లో తవ్విన మట్టిని ఉచితంగా పొలాలకు తరలించేందుకు రైతులకు అనుమతి ఇస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలపగా.. టూరిజం ప్రాజెక్టులలోనూ ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహాలు అందించేదుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!