ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము. అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరుగెత్తుతుంటారు. కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకివ్వబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోందని సమాచారం. గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ. ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీకాదు అంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం ఏంటి? కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Srikanth Odela: రెండో సినిమాకే ఇంత తెగింపా.. అంత ధైర్యం ఏంటబ్బా?
బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు పుడుతుంది. గోల్డ్ కు ఉన్న వాల్యూ అలాంటిది. ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి. దీంతోపాటు వివాదాలు కూడా పెరిగాయి. దీంతో గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, ఎన్ఎఫ్ బీసీలకు ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు టాక్. బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలనే వారి నుంచి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ముందుగా ఆ బంగారం వారిదేనా, కాదా అనేది నిర్ధారించుకోవాలి. అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. తీసుకున్న లోన్ ను దేనికి ఉపయోగించారో బ్యాంకులు, ఎన్ఎఫ్ బీసీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
Also Read:PM Modi: ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్‌గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..
దేశ వ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలను గుర్తించింది ఆర్బీఐ. బంగారం విలువను నిర్ధారించే దగ్గర్నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో పద్దతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయి. అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాకుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నాయి.
Also Read:10th Hall Tickets 2025: విద్యార్థులకు అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేయబోతోంది. ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు, ఎన్ ఎఫ్ బీసీలు ఒకే విధమైన విధివిధానాలు పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనున్నది ఆర్బీఐ. గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడితో పాటు మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతుంది.