ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరగగా సినీ హీరోలు అందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ ను కలిసిన క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరించారు. చిరంజీవి నేతృత్వంలో హీరోలు అందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు జగన్ సమావేశానికి రాలేదని…సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారని, దీనిపై చిరంజీవి…
టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకం కింద మారాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది బెండు తీశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బెల్టు…
వైసీపీ పై భూమా అఖిల ఫైర్ అయ్యారు.. వైసీపీ వెన్నుపోటు దినంతో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. తాజాగా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. "వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... మద్య నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచారు.. సొంత చెల్లిని, తల్లిని బయటికి గెంటేసి జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు.. రైతులకు, రాష్ట్రానికి…
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు.. రేపు అసెంబ్లీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.
AP Legislative Council : ఏపీ శాసనమండలిలో ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదం సాగింది. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు కట్టిన చర్యలతో సభను అడ్డగించాలని వారు ప్రయత్నించారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. “సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు 2024తోసహా మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది.
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే అవకాశమున్న ఈ సమావేశాల్లో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం కాకపుట్టిస్తోంది.