Stop Diarrhoea Campaign: రేపటి నుంచి ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం.. 37.53 లక్షల చిన్నారులకు ఉచిత ఓఆర్ఎస్, జింక్ మాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stop Diarrhoea Campaign: రాష్ట్రంలో డయేరియా నివారణకు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ‘స్టాప్ డయేరియా’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమై జులై 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదేళ్లలోపు చిన్నారులను డయేరియా బారిన పడకుండా కాపాడడం, వ్యాధిపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 37.53 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా రెండు ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని చిన్నారుల ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వెళ్లి ఈ మందులను అందజేయనున్నారు.
అలాగే డయేరియా లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను ఉచితంగా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం 95,37,141 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 5,25,53,908 జింక్ మాత్రలను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. డయేరియా భారతదేశంలో అధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో ఐదో స్థానంలో ఉందని అధికారులు గుర్తు చేశారు. ముఖ్యంగా చిన్నారుల్లో డయేరియా వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో నివారణ చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
అయితే డయేరియా నియంత్రణలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు తాజా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే (NFHS-6) గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా కేసుల శాతం గతంలో 7.2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 4.8 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. జులై 31 వరకు నిర్వహించే ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, సురక్షిత తాగునీటి వినియోగం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.
తాజావార్తలు
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
-
CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
-
Kangana Ranaut: “మంటకు ఆజ్యం పోయవద్దు!” హృతిక్‌పై విరుచుకుపడిన కంగనా రనౌత్
-
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొడుతున్న భారత్.. 39 పతకాలతో టాప్-4లోకి ఇండియా!
-
Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!