కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది.…
మహమ్మారి కరోనా వైరస్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడండని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మరలా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. Also Read: Polavaram…
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువును పెంచుతూ ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎమ్వీ సూర్యకళ వెల్లడించారు.
ప్రభుత్వ సర్వజనాసుపత్రుల నిర్వహణ, సేవల్ని మెరుగుపర్చి వీటి పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించేందుకు రెండు నెలల క్రితం రూపొందించిన 30 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. మూడు గంటల పాటు సాగిన సమీక్షలో అంశాల వారీగా జీజీహెచ్‌లలో చేపట్టబడిన చర్యలపై వివరాల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి.కృష్ణబాబు వెల్లడించారు. కొవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన మీడియాతో చెప్పారు.
ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 63,849 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1461 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. ఇందులో 19,52,736 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,882 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,564కి…