Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Projects: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. అభివృద్ధి పనులను వేగంగా చేపడుతూ ముందుకు సాగుతోంది.. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి నేడు పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం ప్రారంభించనుండగా, సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా ప్రజలకు అంకితం చేయనున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రహదారి, రవాణా సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుంది.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, అనంతరం సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా, గుంటూరు ఛానల్‌పై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జిని కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం రాయపూడి చేరుకుని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)కి అప్పగించిన ప్రజా ప్రతినిధుల భవనాలను పరిశీలించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును కూడా జీఏడీకి అప్పగించే కార్యక్రమం ఉండనుంది. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తుండటంతో అమరావతి అభివృద్ధిలో ఇది మరో కీలక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది.
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
సీఎం చంద్రబాబు షెడ్యూల్
* ఉదయం 10:20 గంటలకు: ఉండవల్లిలోని నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు.
* ఉదయం 10:35 గంటలకు: ఉండవల్లి సమీపంలోని స్టీల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు.
* అనంతరం: స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
* ఉదయం 10:45 నుంచి 11:50 గంటల వరకు: సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులతో సీఎం సమావేశమవుతారు.
* రైతుల సమావేశంలో: సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.
* ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు: గుంటూరు ఛానల్‌పై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జిని పరిశీలిస్తారు.
* అనంతరం: రాయపూడికి చేరుకుని జీఏడీకి అప్పగించిన ప్రజా ప్రతినిధుల భవనాలను సీఎం పరిశీలిస్తారు.
తాజావార్తలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?