Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
- రూ.40 కోట్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా
- గూగుల్ టేక్అవుట్, కాల్ డేటాపై ప్రశ్నలు
- హత్య సమయంలో తన కదలికలపై సునీల్ వివరణ
- ప్రాణహాని ఉందంటూ ఈడీ ముందు వాంగ్మూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన విచారణ ముగిసింది. రెండో రోజు దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో ఈడీ అధికారులు సునీల్ యాదవ్‌ను పలు కీలక అంశాలపై క్షుణ్ణంగా ప్రశ్నించారు. ప్రధానంగా హత్య వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, సుమారు రూ. 40 కోట్ల ఫండింగ్ వ్యవహారాలు, ఫోన్ కాల్స్ , డిజిటల్ ఆధారాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
గూగుల్ టెక్ అవుట్ ఆధారాలు.. నిందితుల కాల్ డేటాపై ఆరా
విచారణ సందర్భంగా కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఏ3 నిందితుడు ఉమాశంకర్ రెడ్డిలతో సునీల్ యాదవ్ జరిపిన ఫోన్ సంభాషణలపై ఈడీ అధికారులు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ముఖ్యంగా ఉమాశంకర్ రెడ్డితో తరచూ మాట్లాడిన కాల్ డేటా రికార్డులను ఆయన ముందు ఉంచి వివరాలు సేకరించారు. అంతేకాకుండా, సాంకేతిక సాక్ష్యాలైన ‘గూగుల్ టెక్ అవుట్’ (Google Takeout) వివరాలను సునీల్ యాదవ్ ముందు ఉంచి, వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన కదలికలు, లొకేషన్ హిస్టరీపై నిలదీశారు.
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
హత్య సమయంలో ఇంట్లోనే ఉన్నా..
ఈడీ విచారణ సందర్భంగా సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను స్వగృహంలోనే ఉన్నానని అధికారులకు తెలిపారు. అదే సమయంలో, తనకు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హత్య వెనుక సాగిన ఆర్థిక లావాదేవీల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఈడీ అధికారులు సేకరించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!