పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది. ఇంతటి హైప్ ఉన్న ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.
Also Read : Nelson Dileep Kumar : నేను జైలర్ 2పై అంచనాలు పెంచను.. ఒక్క మాటలో వెస్ట్ అంటారు…
కాగా ఈ సినిమా బుకింగ్స్ ఎప్పడు ఓపెన్ చేస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నైజాంలో ఓజి టికెట్స్ కు భారీ డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో నైజాం బుకింగ్స్ కు సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది. ఓజీ నైజాం బుకింగ్స్ ను ఈ నెల 20న ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. అందుకు సంబందించి అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ చేసేసారు. నైజాం మొత్తం అన్ని సింగిల్ స్క్రీన్స్ లో ఓజీ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే టికెట్స్ హైక్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు హైదరాబాద్ లో ఓజి ఈవెంట్ చేసేందుకు మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైప్ చుస్తే తోలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీకి భారీ నెంబర్ కనిపించే అవకాశం ఉంది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.