Tragedy in Paderu: పాడేరులో విషాదం.. అంబులెన్స్ ఆలస్యం, ఆటోలో ప్రసవించిన మహిళ, శిశువు మృతి
- అల్లూరి జిల్లా పాడేరులో విషాదం..
- అంబులెన్స్ ఆలస్యంతో ఆటోలో ప్రసవించిన మహిళ..
- పుట్టిన వెంటనే శిశువు మృతి, కుటుంబ సభ్యుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy in Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. గేమ్మెలి శాంతి అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాడేరు సిల్వర్ నగర్‌లో నివసిస్తున్న ఆమెకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. వెంటనే బంధువులు అంబులెన్స్ కోసం కాల్ చేశారు. అయితే, రెండు గంటలు గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో వారు నిరాశ చెందారు.
Read Also: Current wires: ఎవర్రా మీరంతా.. కరెంట్ వైర్లతో ఊయ్యలా ఉగడమేంట్రా..
Also Read
దీంతో మరింత ఆలస్యం చేస్తే ప్రమాదం జరుగుతుందని భావించి వెంటనే, ప్రైవేట్ ఆటోలో గేమ్మెలి శాంతిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆటోలోనే ప్రసవం జరిగిపోయింది. ఇక, పుట్టిన వెంటనే పసికందు మృతి చెందింది. ఈ ఘటన పాడేరు ఐటీడీఏకు కూతవేటు దూరంలో జరగడం స్థానికులను మరింత కలచి వేసింది. సకాలంలో వైద్యం అందించి ఉండి ఉంటే శిశువును కోల్పోయే పరిస్థితి రాకపోయేది కదా అని బాధిత తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!