ఈ మధ్య ఎవరి మాట లేదు సరికదా.. వారికి నట్టు వారు చేసుకుంటూ.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కరెంట్ వైర్లతో ఉయ్యాల ఊగడం ఎప్పుడైనా కానీ.. కొంత మంది పిల్లలు కరెంట్ వైర్లను ఉయ్యాలాగా చేసుకుని.. వాటితో ఆడుతూ.. నీటిలోకి జంప్ చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
కరెంట్ పవర్ లైన్స్ పట్టుకోని వేలాడుతూ హంగామా చేశారు. అంతే కాకుండా నీటిలోకి దూకుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన నార్త్ ఇండియాలో జరిగినట్లు సమాచారం. ఏదో ఒక తెలుగు సినిమాలో కరెంట్ వైర్లపై బట్టలు ఆరేసుకుంటుంటారు మహిళలు. అక్కడికి వచ్చిన ఈ హీరో ఆ సీన్ చూసి ఆశ్చర్యపోతాడు.. కరెంట్ వైర్లపై బట్లలపై బట్టలు ఆరేస్తే షాక్ కొట్టదా.. అని ఓ వ్యక్తిని అడిగితే.. అతడు ఈ వైర్లలో కరెంట్ ఉండదు.. అందుకే ఇలా చేస్తున్నారని చెప్పడం భలే కామెడీగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు చేసేది ప్రస్తుతం అలాగే కనిపిస్తోంది. కానీ ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నెటిజన్లు.
చాలా మంది పిల్లలు నీళ్లలో సగం మునిగిపోయి ఉన్న కరెంట్ పోల్ విద్యుత్ వైర్లను పట్టుకోని వేలాడుతూ ఆటలాడుతున్నారు. పవర్ లైన్ పట్టుకొని బాలురు నీళ్లలోకి దూకుతూ ఎంజాయ్ చేశారు. కేరింతలు కొడుతూ విద్యుత్ వైర్లతో సర్కస్ ఫీట్లు చేశారు. ఇటీవల వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా వరకు వరద రావడంతో దగ్గరలోని కరెంట్ స్తంభాలు మునిగిపోయాయి. దీంతో వాటిలో కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వైర్లలో విద్యుత్ సరఫరా బంద్ లేకపోవడంతో పిల్లలు వాటిని పట్టుకుని వేలాడుతూ సరదాగా గడిపారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు స్పందించారు. రేయ్ ఎవర్రా మీరంతా అంటూ నెటిజన్‌లు షాక్ అయ్యారు. అవగాహన లేకపోతే, విద్యుత్ లైన్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోకుండా ఇలా ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి వస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. నదికి దగ్గరలో ఎవరు కరెంట్ పోల్ కట్టారని అధికారులపై పలువురు నెటిజన్‌లు మండిపడ్డారు.
why education is important pic.twitter.com/mH2NRu9Way
— desi mojito (@desimojito) September 20, 2025