AP DGP Harish: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రంపచోడవరాన్ని సందర్శించారు. ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లతో పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన జిల్లా పర్యటనకు వెళ్లారు.
సహజ మరణాలను లాకప్ డెత్‌లుగా పేర్కొంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. సహజ మరణాలను లాకప్‌డెత్‌లుగా పేర్కొంటూ కథనాలను వండి - వార్చి, వడ్డిస్తున్న పత్రికలు మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు..
YSRCP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వైసీపీ బృందం కలవడానికి వెళ్లింది. అయితే, డీజీపీ అందుబాటులో లేరని.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశానికి వెళ్లారని కార్యాలయ సిబ్బంది పేర్కొనింది. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా కనీసం ఏ అధికారి మా రెప్రజెంటేషన్ ను కూడా తీసుకోవడం లేదని వైసీపీ బృందం ఆరోపించింది.
డీజీపీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకి హరీష్ కుమార్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెబుతున్న 2047 విజన్ అమలుకు రాష్ట్ర శాంతి భద్రతలు కీలకమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తన హయంలో కూడా అవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. టీం వర్క్ తోనే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు…
ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియామకమయ్యారు. హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి. గత ఎన్నికల ముందు హరీష్‌కుమార్‌ను ఈసీ డీజీగా నియమించింది. ఈ నెల 31తో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశం అయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) సీరియస్ కావటం.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అత్యవసరం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ అయ్యింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడింది.