అడ్వకేట్ అక్బర్ హత్యకేసు మిస్టరీగా మారుతోంది. అక్బర్ ను అసలు ఎవరు చంపారు? చనిపోయి దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత కుటుంబ సభ్యులకు ఎందుకు అనుమానం వచ్చింది.. పక్కా ప్లాన్ ప్రకారం ముందు అనుకున్న స్కెచ్ ను నిందితులు అమలు చేశారా.. వివాహేతర సంబంధం ఆయన అడ్డును తొలగించుకోవడానికి కారణమైందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాకినాడ ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అక్బర్ విధులు నిర్వహిస్తున్నాడు. సిటీలో అందరికీ తెలిసిన వ్యక్తి పరిచయాలు కూడా చాలా ఎక్కువే… అక్బర్ కి మొదటి భార్య పాప పుట్టిన తర్వాత అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత రెండేళ్లకు 2005లో అహ్మద్ ఉనీషా బేగం ను పెళ్లి చేసుకున్నాడు.
వీళ్లకు పాప బాబు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు… వృత్తి రీత్యా అడ్వకేట్ కావడంతో ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది… జూన్ 23న అక్బర్ గుండెపోటుతో చనిపోయాడు కానీ ఒంటిపై గాయాలు ఉండడంతో అక్బర్ తల్లిదండ్రులు సోదరులు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ భార్య ఉన్నీషా బేగం ని అడగగా కారు దిగుతుండగా చిన్న ప్రమాదం జరిగిందని అందుకే గాయాలని చెప్పింది… భర్త పోయి ఆమె ఉంటే ఆమెను అనుమానించడం కరెక్ట్ కాదని అక్కడితో ఆ విషయాన్ని వదిలేసారు. గుండెపోటుతో సహజంగా మరణించాడని నిర్ధారించుకున్నారు.. కానీ ఆ తర్వాత ఫోన్ లో కాల్ రికార్డ్స్ చూసి షాక్ అయ్యారు అక్బర్ సోదరులు తల్లిదండ్రులు… ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కాల్ రికార్డ్స్ వింటే అర్థమైంది. వాళ్లుండే అపార్ట్మెంట్లోని రాజస్థాన్ కు చెందిన మార్వాడి వ్యాపారి ఉంటాడు… అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అక్బర్ ని అడ్డు తొలగించుకోవాలని భావించింది, ఇందులో మరికొందరు కూడా పాల్గొన్నట్లు పోలీసులు విచారణ లో తేలింది. హత్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిని గుర్తించారు పోలీసులు.
హత్యకు యానాంలో పక్కాగా ప్లాన్ వేసుకున్నారు నిందితులు… దిండుతో ముఖంపై గట్టిగా ఒత్తి చంపినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరితోపాటు హత్యలో మరికొందరు పాల్గొన్నట్లు అర్థమవుతుంది.. అక్బర్ అడ్డు తొలగించుకుంటే ఉన్న ఆస్తులతో ప్రియుడుతో గడపొచ్చు అని బేగం పక్కా ప్లాన్ వేసింది … అనుకున్న ప్లాను అమలుపరచడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు హత్యకు ప్లాన్ జరిగినప్పటికీ బయటపడకుండా స్కెచ్ వేశారు కానీ అందరినీ భర్త చనిపోయి బాధలో ఉన్నట్లు నటించింది… అక్బర్ లేకపోతే ఎలా బతకాలని వచ్చిన వాళ్ళ దగ్గర నాటకాలు వేసింది… కానీ విస్తు గొలిపే ఆ ఫోన్ సంభాషణ విని అక్బర్ తల్లిదండ్రులు సోదరులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.
అక్బర్ ముస్లిం కావడంతో తలకు టోపీ పెట్టుకుంటారు… ఆ టోపీలో మత్తుమందు చల్లి అతని స్పృహ కోల్పోయేలా చేశారు … తర్వాత అతనికి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు… అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది… తర్వాత రోజు ఉదయం వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడి తాము అనుకున్న పథకాన్ని అప్లై చేశారు… కేసుల ఒత్తిడి గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటున్నారని.. ఈ మధ్య నిరంతరం వాటి గురించే చర్చిస్తున్నారని కలరింగ్ ఇచ్చారు… టెన్షన్ తట్టుకోలేక గుండెపోటుతో మరణించినట్లు సీన్ క్రియేట్ చేసి సక్సెస్ అయ్యారు.. కానీ చివరికి కాల్ రికార్డ్ ద్వారా వాళ్లు అనుకున్న ప్లాన్ మొత్తం బయటపడింది.. పోలీసులు బేగం తో పాటు మార్వాడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు మిగిలిన నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.
మొత్తానికి అడ్వకేట్ అక్బర్ ను అతికిరాతకంగా కట్టుకున్న భార్య కడ తేర్చింది… ప్రియుడు మోజులో పడి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి సక్సెస్ అయింది.. చివరికి కాల్ రికార్డ్స్ లో అడ్డంగా బుక్ అయ్యి ఇప్పుడు ఊసలు లెక్కబెడుతున్నారు నిందితులు… ఎందరికో అన్యాయం జరగకుండా కేసులు వాదించిన అక్బర్ ను వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య కిరాతకంగా చంపేయడం విషాదం కాక మరేమిటి?
Read Also: Mobile Usage: ఇండియాలో సగటున పెరిగిన మొబైల్ వినియోగం.. ఎక్కువమంది చూసేవి ఏంటంటే?