చంద్రబాబు అరెస్ట్‌పై అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటిసారిగా డీఐజీ స్థాయి అధికారిని అరెస్టు కోసం పంపించారని.. రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాప్టర్‌లో తీసుకెళ్తామని చెప్పిందని.. జైలు మాన్యువల్‌ను కూడా కాదని కూడా చంద్రబాబుకి ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు అని అడిషనల్ అడ్వకేట్ జనరల్పొన్నవోలు సుధాకర్ అన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసింది మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారు. అప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. పిటిషన్ డిస్మిస్ కాగానే రఘురామ కృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీశారు అని పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారు అని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. రఘరామ కృష్ణరాజు ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసింది. రేపు మధ్యాహ్నంలోగా…