ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకి సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నా పత్రానికి భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇకపోతే ఈసారి పదవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుక రాబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకోసం ఎగ్జామ్ పేపర్ కు ఓ క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో అనేక అక్రమాలను నివారించేందుకు అవకాశం కలుగనుంది.
also read: Paytm : థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం
అంతేకాక పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ల కు ఎట్టిపరిస్థితులలో అనుమతి ఉందని అధికారులు వెల్లడించారు. దీనితో పరీక్షా కేంద్రాలకు నో మొబైల్ జోన్లుగా ప్రకటించారు. ఇందులో భాగంగానే డీఈవో సహా చీఫ్ సూపరింటెండెంట్, ఇంకా మరికొంది అధికారులు సైతం పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకైనా పాల్పడితే మాత్రం, అందుకు బాధ్యులైన వారికి నేరం రుజువు అయితే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని విశాఖ జిల్లా డీఈవో చంద్రకళ తెలిపారు.
also read: Off The Record: వైసీపీలో ఫైనల్ లిస్ట్ టెన్షన్..
ఇందులో భాగంగా విశాఖ జిల్లా డీఈవో చంద్రకళ మాట్లాడుతూ.. జరగబోయే పడవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా ఎగ్జామ్ పేపర్ కు ఒక క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలిపింది. దీనితో అక్రమాలను నివారించేందుకు అవకాశం కలుగుతుంది. ఇక పరీక్ష టైం టేబుల్ చూస్తే..
మార్చి 18 న – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19న- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21న- థర్డ్ లాంగ్వేజ్
మార్చి 23న- గణితం
మార్చి 26న- ఫిజిక్స్
మార్చి 28న- బయాలజీ
మార్చి 30న- సోషల్ స్టడీస్ జరగనున్నాయి.