తాజాగా యాదాద్రి లక్ష్మి నరసింహ ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ పై బదిలీ వేటు పడింది. దీనితో కొత్త ఆలయ నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మేర తెలిపింది. 11వ తేదీన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రికి, అలాగే మంత్రులకు కలిపి వేద బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Also Read: Viral Video : స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. షాక్ అవుతున్న నెటిజన్స్…
అయితే ఈ సమయంలో సీఎం, మిగతా మంత్రుల కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలకు కాస్త చిన్న పీటలు వేశారు ఆలయ అధికారులు. దీనితో పెద్ద ఎత్తున ఈ విషయం గురించి వివాదం రాజుకుంది. ఈ సందర్భంగా ఆ మంత్రులకు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ విషయం ఇంత సీరియస్ అయ్యిందో. ఇక ఈ అంశం సంబంధించి ఆలయ ఈఓ బదిలీకి కారణమని సమాచారం.
Also Read: Congress: నేటితో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు
పరిస్థితి ఇలా ఉండగా విపక్షాల ఆరోపణలన పై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఆ సమయంలో తానే కావాలని చిన్న పీట పై కూర్చున్నానని ఆయన తెలిపారు. బదిలీకి గురైన రామకృష్ణరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ఇది వరకు ఈవో పనిచేసిన గీతారెడ్డిని తొలగించిన తరువాత ఆయనకు యాదాద్రి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సంఘటనతో రామకృష్ణరావు స్థానంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.