Knife Attack on Lecturer: బాంధవ్యాలకు బరువు పెరుగుతోంది. అనుమానాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఒకరిపై ఒకరు అనుమానంతో చంపేందుకు వెనుకాడటం లేదు. రెండు రోజుల ముందు తన భార్య వేరొకరొతో వివాహిత సంబంధం ఏర్పరుచుకున్నందుకు వద్దని చెప్పడంతో ముందు అలాంటి పనులు చేయనన్న భార్య మళ్లీ అదే దారిలో వెళుతుందడటంతో.. ఆవేదనకు గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన భార్యపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడో భర్త. ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. అతని అనుమానాలకు విసిగిన భార్య అతనితో దూరంగా జీవనం సాగిస్తున్నా.. భరించలేని భర్త ఆమెను చంపేందుకు పథకం వేసి ఆమెపై దాడిచేశాడు. ఈఘటన ఆంద్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Casino Case: ‘చీకోటి’ క్యాసినో కేసులో ఈడీ దూకుడు.. ఇప్పటికే పలువురికి నోటీసులు
అనంతపురం జిల్లా ఆర్ట్స్ కళాశాల లో దారుణం చోటుచేసుకుంది. కామర్స్ లెక్చరర్ సుమంగళి పై భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ రూమ్ లో లెక్చరర్ సుమంగళి తంబ్ వేసి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన భర్త పరేష్ ఆమెను కత్తితో దాడిచేసి గొంతు కోసాడు. అది చూసిన విద్యార్థులు పరేష్ ను అడ్డుకోవడంతో.. తప్పించుకుని అక్కడనుంచి పరారయ్యాడు. లెక్చరర్ తీవ్రగాయాలు కావడంతో.. హుటా హుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లెక్చరర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సుమంగళి ఏడాది క్రితం ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వచ్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. గత 20 ఏళ్లుగా గుంటూరులో లెక్చరర్ గా సుమంగళి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అనంతపురంలోని శ్రీనివాస్ నగర్ లో ఆమె నివాసం ఉంటున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా సుమంగళి తన భర్త పరేష్ తో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తనపై అనుమానంతోనే భర్త హత్యాయత్నం చేసినట్టు బాధితురాలు సుమంగళి పేర్కొన్నారు. సమాచారం అందుకు పోలీసులు ఆసుపత్రికి వెళ్లి సుమంగళి చెప్పిన వివరాలు మేరకు కేసు నమోదు చేసి భర్త ను గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని శిక్షవిధిస్తామని పేర్కొన్నారు. అయితే ఈఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు కాలేజీలో జరగకుండా చూడాలని అధికారులు అలెర్ట్ గా ఉండాలని కోరుతున్నారు. ఇలా జరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. కాలేజీలో ఎవరిని అనుమతించకుండా చూడాలని ఐడీ వుంటేనే లోపలికి వదిలే విధంగా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Dog Saved Owner’s Life: యజమాని కోసం ప్రాణాలు అర్పించిన కుక్క