Tirumala: టీటీడీ ఖజానాకు రూ.1100 కోట్ల విరాళాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు. భక్తుల నుంచి కానుకలు, విరాళాల రూపంలో శ్రీవారికి వందల కోట్లు చేరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. దాతల సహకారం మాత్రం టీటీడీకి భారీగానే లభించింది. కోవిడ్ సమయంలోనూ టీటీడీ కార్యక్రమాలకు రూ.వందల కోట్ల విరాళాలు లభించాయి. టీటీడీ పథకాలకు 2019లో రూ.308 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020లో రూ.232 కోట్లు, 2021లో రూ.564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు చేరాయి.
పథకాల వారీగా గమనిస్తే.. గత మూడేళ్లలో అన్నప్రసాదం పథకానికి రూ.390 కోట్లను భక్తులు విరాళంగా సమర్పించారు. అటు ప్రాణదాన పథకానికి రూ.160 కోట్లు, గోసంరక్షణ పథకానికి రూ.62 కోట్లు, బర్డ్ ట్రస్ట్ పథకానికి రూ.41 కోట్లు వచ్చి చేరాయి. వెంకటేశ్వర సర్వ శ్రేయా ట్రస్టుకు రూ.29 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.36 కోట్లు, వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.26 కోట్లు, శంకర నేత్రాలయ ట్రస్టుకు రూ.5 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.350 కోట్లను భక్తులు విరాళంగా అందించారు. కోవిడ్ సమయంలో హుండీ ఆదాయం పడిపోయినా టీటీడీ ట్రస్టుల పథకాలకు రూ.1100 కోట్ల మేర భక్తులు టీటీడీకి విరాళంగా సమర్పించారు.
Also Read
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
- OTR : మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు?
తాజాగా తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళాలు అందాయి. ఆదివారం నాడు టీటీడీలోని ట్రస్ట్‌లకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలను విరాళంగా అందించారు.
తాజావార్తలు
-
INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు..
-
Healthy Protein Laddu: పిల్లల్లో జ్ఞాపకశక్తి, తెలివితేటలను పెంచే హెల్తీ ‘ప్రోటీన్ లడ్డు’.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!