అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు. భక్తుల నుంచి కానుకలు, విరాళాల రూపంలో శ్రీవారికి వందల కోట్లు చేరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. దాతల సహకారం మాత్రం టీటీడీకి భారీగానే లభించింది. కోవిడ్ సమయంలోనూ టీటీడీ కార్యక్రమాలకు రూ.వందల కోట్ల విరాళాలు లభించాయి. టీటీడీ పథకాలకు 2019లో రూ.308 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020లో రూ.232 కోట్లు, 2021లో రూ.564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు…