జ‌న‌వ‌రి 12, బుధవారం దిన‌ఫ‌లాలు…

మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థికపరమైన చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ యత్నాలకు కుటుంబీకుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు చేపడతారు.

వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. దూర ప్రయాణాలలో చికాకులు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతతాయి. ఇటుక, ఇసుక, కలప వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది.

మిధునం : ఈ రోజు ఈ రాశివారు ఆదాయానికి తగినట్లు ధనం వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలతో గృహం సందడిగా ఉంటుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడక తప్పదు. ఆశించిన వ్యక్తుల కలయిక సాధ్యం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ఖర్చులు, ఇతరత్రా అవసరాలు అధికంగా ఉంటాయి.

కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు దైవ కార్యాల్లో నిమగ్నులై ఉంటారు. ఆశించిన ధనం సమయానికి అందకపోవటంతో ఒడిదుడుకులు తప్పవు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అలంకారాలపట్ల ఆసక్తి పెరగుతుంది. అప్రయత్నంగాకొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

సింహం : ఈ రోజు ఈ రాశిలోని సిమెంటు వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.

కన్య : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, ఫ్యాన్సీ, పచారి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.

తుల: ఈ రోజు ఈ రాశివారికి ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. విద్యార్థులు మితిమీరిన ఉత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. చేపట్టిన పనులు అనుకున్నంత వేగంగా పూర్తి కావు.

వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. దూర ప్రయాణాల్లో చికాకులు వంటివి అధికమవుతాయి. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు వింటారు. మీ ప్రత్యర్థుల విషయంలో అనుక్షణం అప్రమత్తత అవసరం.

ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలించవు. కిరాణా, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన తాత్కాలిక అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం మంచిది.

మకరం : ఈ రోజు ఈ రాశివారికి రావలసిన ధనం చేతిలో పడగానే మిత్రులు బంధువులు మీ నుంచి సాయం అర్థిస్తారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలు ప్రతిభా పోటీల్లో విజయం సాధిస్తారు. విద్యార్థుల మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి.

కుంభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. ఆత్మీయులతో కలిసి విందులు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు వ్యవహరాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.

మీనం : ఈ రోజు ఈ రాశివారు జీవిత భాగస్వామితో సంయమనం పాటించడం మంచిది. కాంట్రాక్టులకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. అతి కష్టంమ్మీద మీకు కావలసిన సమాచారం లభిస్తుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయంలోను ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.

Related Articles

Latest Articles