Pawan Kalyan: పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో.. తన ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 2019లో నన్ను గెలిపించలేదు.. పరీక్షించారు.. నిలబడతాడో లేదో అని.. అది మంచిదేనని పేర్కొన్నారు.. గిరిజన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన పవన్.. ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి నడిచి వెళ్లారు.. గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి తెలుసుకున్నారు.. గిరిజనులకు డోలీ మోతలు తప్పేలా కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.. అయితే, రోడ్ల నిర్మాణంలో క్వాలిటీ ఉందో లేదో మీరు చెక్ చేస్తూ ఉండాలి.. గొడవ పెట్టుకోండి అని సూచించారు.. డోలిలో గర్బీణీలు చనిపోతే నా చెల్లి, అక్క చనిపోయినంత బాధపడే వాడిని అని గుర్తుచేసుకున్నారు.. గిరిజనలను చూస్తే నాకు అసూయగా ఉంది.. ఇంత చక్కటి ప్రకృతి మధ్య బతుకుతూ నాకు అసూయ కలిగిస్తున్నారన్నారు.. నాకు గుడి కట్టొద్దు.. బడి కావాలన్నా యాన.. మన్యంలో డోలీ మోతలు తప్పించడానికి 40 కోట్ల రూపాయలతో 19 రోడ్లు మంజూరు చేశాం.. భవిష్యత్ లో 350 కోట్లతో మన్యంలో అన్ని పంచాయతీలన్నీ కలుపుతూ రోడ్లు వేస్తాం అని హామీ ఇచ్చారు..
Read Also: Strange Thief: అదేం ఆనందమో..! మహిళల జాకెట్లు మాయం చేస్తున్న దొంగ..
బుగ్గలు నిమరడం.. తల నిమరడం నాకు తెలియదు.. మీ కన్నీళ్లు చూసి పారిపోను.. ఐ లవ్ యూ అంటూ గిరిజనులకు చెప్పారు పవన్ కల్యాణ్.. నా పిల్లలకు కూడా మీకు చెప్పినన్ని సార్లు ఐ లవ్ యూ చెప్పలేదన్న ఆయన.. మాట ఇచ్చాను… రెండు నెలలకోసారి రెండ్రోజులపాటు మన్యం అంతా తిరుగుతా.. గిరిజనం కోసం ఒళ్లు వంచి పని చేస్తానన్నారు.. గిరిజనుల కష్టాలు తెలియాలంటే నడిస్తేనే తెలుస్తాయని నడిచి వెళ్లాను అన్నారు.. ఇక, మద్యం ధర పెంచి డబ్బు చేసుకున్నారు జగన్,, మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకున్నారు.. గిరిజనులకు మాత్రం రోడ్లు వేయలేకపోయారు.. మీ దగ్గరకు ఒక్క మంత్రైనా వచ్చారా? అని ప్రశ్నించారు. గిరిజన యువతకు పర్యాటక రంగంలో ఉపాధి కల్పిస్తాం.. ప్రతి రెండు నెలలకు మూడు రోజులు మన్యంలో పర్యటిస్తానన్నారు.. మూడు విడతల్లో గిరిజన ప్రాంతాల్లోని రోడ్లు వేస్తాం.. గిరిజన గ్రామాలు చిన్నగా ఉంటే రోడ్ల నిర్మాణం, అభివృద్ధి ఇబ్బంది అవుతోంది. 20 మంది చొప్పున ఒకే చోట ఉండే కంటే.. కనీసం 200 మంది ఒకే చోట ఉంటే రోడ్ల నిర్మాణం తేలిక అవుతుందన్నారు. సినిమా అంటే సరదా… అయితే, సినిమాలకు రావాలన్నా రోడ్లు ఉండాలి కదా? అని ప్రశ్నించారు.. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పించేలా కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతందని స్పష్టం చేశారు.
Read Also: 35Movie : 35 చిన్న కథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే..?
పోరాట యాత్రలప్పుడు పాడేరు, అరకు గిరిజన ప్రాంతాల్లో తిరిగా.. రోడ్లు, తాగునీటి కొరత, యువతకు ఉపాధి లేని విషయాన్ని గుర్తించానని గుర్తుచేసుకున్నారు పవన్ కల్యాణ్.. అటవీ ప్రాంతాల్లో అద్బుతమైన సౌందర్యం ఉంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.. మేం డబ్బులు లేకున్నా… కొండ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం.. రుషి కొండకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు.. కానీ, ఇక్కడ 9 కోట్లతో రోడ్లు వేయలేకపోయారు అని మండిపడ్డారు.. ఒక కిలో మీటర్ దూరం నడిస్తే కానీ గిరిజనుల సాధక బాధలు తెలియవని.. నడిచి వచ్చాను అన్నారు.. నా కష్టాలు తీర్చమని తిరుమల కొండ ఎక్కా.. ఇప్పుడు ఈ కొండ ఎక్కా గిరిజనుల కష్టాలు తీర్చమని అని పేర్కొన్నారు.. రోడ్డు వేసేలోగా.. కనీసం మనుషులు నడిచేందుకు వీలుగా చదును చేయాలని ఇప్పుడే ఆదేశించాను అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..