ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15, 2025కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఎన్నికల నీతి నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు…
పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో.. తన ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 2019లో నన్ను గెలిపించలేదు.. పరీక్షించారు.. నిలబడతాడో లేదో అని.. అది మంచిదేనని పేర్కొన్నారు..
ఏపీలో ఎన్నికలకు 17 నెలల వరకూ గడువు వుంది. అయితే, అధికార పార్టీ మాత్రం ఎన్నికలకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. 175 సీట్లే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంటుంది. రెండు రోజుల క్రితం ఉరవకొండ పట్టణంలో విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో జరిగిన ఘర్షణ కారణంగా ఈ గొడవ మరింత రాజుకుంది. వీరి కుటుంబంలో రెండు వర్గాలు ఉండగా గత ఎన్నికల్లో తన తండ్రి విశ్వేశ్వరరెడ్డి ఓటమికి విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, మరో సోదరుడి కుమారుడు నిఖిల్ నాథ్ రెడ్డి కారణమని, ప్రత్యర్థి నాయకులతో కలిసి…
రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు. 2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.…