గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు అడకత్తెరలో ఇరుక్కున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రిగా ఆమె మెడ మీద కత్తి వేలాడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే... దీనికి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సాలూరు నియోజకవర్గం నుంచి పోరాడి పోరాడి ఏదోలా ఎమ్మెల్యే అయిపోయిన గుమ్మడి..
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ వాహనం గన్‌మెన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది.. రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తుండగా బ్యాగ్ మాయమైంది. అందులో 30 బుల్లెట్లతో గన్ మ్యాగ్‌జైన్ ఉండటం పోలీసు శాఖలో కలకలం రేపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి గాను రమణను విధుల నుంచి సస్పెండ్ చేశారు పార్వతీపురం జిల్లా ఎస్పీ..
రోడ్లు వేయకుండా అడ్డుకుంటే ఊరుకోబోమని సర్పంచ్‌లను హెచ్చరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అంగన్వాడీల ప్రతి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. ఆందోళనకు వెళ్లొ్దని సూచించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. నవంబర్ 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి.. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది.. దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం..