డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు గని ఈ మధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. మార్కెట్ లో వీటికి డిమాండ్ రోజురోజుకు పెరగడంతో ఎక్కువ మంది రైతులు వీటిని పండించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా సాగు లోకి వస్తోంది..అయితే ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి కాస్త ఎక్కువే. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది. కానీ ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే రెండు సంవత్సరాల లోనే పంట చేతికి వస్తుంది. ఒక ఏకంగా నాటిన తర్వాత 25 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది.
ఈ పండ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి.. అందులో అమెరికన్ బ్యూటీ, తైవాన్ పింక్, మొరాకిన్ రెడ్, డిలైట్, షుగర్ డ్రాగన్, సీయం రెడ్ లాంటి రకాలు ఉన్నాయి. సాధారణ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఎకరాకు 2000 మొక్కలు, ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు మూడు వేల మొక్కలు నాటుకోవాలి.. అంతేకాదు.. ఇందులో 6000 మొక్కలను ఎక్కువగా నాటుకోవచ్చు.. అల్ట్రా హై డెన్సిటీ పద్ధతినే ట్రెల్లీస్ పద్ధతి అంటారు.. ఎక్కువ మొక్కలను నాటడం వల్ల ఎక్కువ దిగుబడిని పొందవచ్చు..
మాములుగా సాగు చెయ్యడం కన్నా ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి దాదాపుగా ఐదు టన్నుల దిగుబడి పొందవచ్చు. పంట కోసం పెట్టిన పెట్టుబడి అంతా మూడు సంవత్సరాల లోపు చేతికి వస్తుంది. ప్రతి సంవత్సరం పంట దిగుబడి పెరుగుతూనే ఉంటుంది. ఒక ఎకరం లో సాగు చేయడానికి 250 స్థంబాలు 10 అడుగులవి అవసరం అవుతాయి. 250 స్తంభాలు 6 అడుగులవి అవసరం అవుతాయి.. ఇక ఈ పంట మధ్యలో కూరగాయలను కూడా సాగు చేసుకోవచ్చు.. మరింత లాభాలను పొందవచ్చు..