Viral News:సాధారణంగా కోర్టులు తీవ్రమైన నేరం చేస్తే తప్ప మనుషులకు జీవిత ఖైదు విధించవు. ఒక వేళ శిక్ష పడితే ఖైదు చేయబడ్డవారు అనుభవించాల్సిందే. అలాగే కోతి తాను చేసిన నేరానికి ఇప్పుడు జీవిత ఖైదు అనుభవిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ లో ఓ కోతి ఇప్పుడు అలాంటి జైలు శిక్షే అనుభవిస్తోంది. అసలే కోతి.. ఆపై కల్లు తాగింది అన్న నానుడి అనుగుణంగా తోక ఉంది కదా కనపడిన ప్రతి వారిపైకి గెంతింది. ఇంకేముంది.. ఇంకెలాగ ఎగురుతావో ఎగురు అన్నట్లు తీసుకెళ్లి బోనులో పెట్టారు. జీవితాంతం బయటకి రాకుండా కట్టడి చేశారు.
Read Also: Viral Video: అయ్యో.. కళ్లెదుటే బిడ్డల ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయింది
Read Also: Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..
ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపుర్‌లో ఓ మాంత్రికుడు కాలియా పేరుతో కోతి సాకుతుండేవాడు. తాంత్రికుడు తాను మద్యం సేవిస్తూ కోతికి కూడా అలవాటు చేశాడు. దీంతో మద్యానికి బానిసైన కోతి 2017లో తాంత్రికుడు చనిపోయిన తర్వాత మద్యం తాగించే వాళ్లు లేకపోవడంతో మద్యం కోసం రోడ్లపై వెళ్లే వారిపై దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా 250మందిని గాయపరిచింది. అంతే కాదు మద్యం తాగేందుకు మద్యం దుకాణాల దగ్గరకు వెళ్లి అక్కడ తాగుతున్న వారి చేతుల్లోని బాటిళ్లు, గ్లాసులను లాక్కొని పారిపోయేది. దీంతో కోతి చేష్టలను భరించలేకపోయిన స్థానికులు, మద్యం షాపు యజమానులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కోతిని అతికష్టం మీద బంధించారు. మద్యం తాగుతూ జనంపై దాడి చేస్తోందని కాన్పూర్ జూలో బంధించారు. కోతిని మానసిక వైద్యుడికి చూపిస్తూ ట్రీట్‌మెంట్ చేయించారు.