గత నాలుగు వారాల నుండి 66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ తీవ్రమైన తలనొప్పితో బాధపడినప్పటికీ.. మర్చి 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా ఆయన పాల్గొన్నారు. అయితే మర్చి 17న ఆయన మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడం వల్ల వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. దాంతో అదే రోజు ఆసుపత్రిలోని వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్సను నిర్వహించింది.
Also read: 10th Exams: 32ఏళ్ల వయసులో కొడుకుతో కలిసి పది పరీక్షలకు హాజరైన తల్లి..!
ఆ తర్వాత సద్గురు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే బాగానే కోలుకుంటున్నారు. సద్గురు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె రాధే జగ్గీ ఎప్పటికప్పుడు విషయాలను పంచుకుంటోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు.. సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈయన ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సర్జరీ తర్వాత సద్గురు వేగంగా కోలుకుంటున్నారు.
Also read: Delhi Metro: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నిరసన.. మెట్రో స్టేషన్లు మూసివేత
ఈ నేపథ్యంలో సద్గురు ఆరోగ్య పరిస్థితి పై ఓ అప్డేట్ ఇచ్చారు. సద్గురు ఆసుపత్రి బెడ్ పై తన తలకు బ్యాండేజ్‌తో ఎంతో కూల్ గా న్యూస్ పేపర్ చదువుతున్న ఓ షార్ట్ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోకు వేగంగా కోలుకుంటున్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోను చూసిన నెటిజన్లు, అభిమానులు సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
#Sadhguru #SpeedyRecovery pic.twitter.com/rTiyhYPiJM
— Sadhguru (@SadhguruJV) March 25, 2024