సాధారణంగా పీతల కాళ్లు చాలా బలంగా ఉంటాయి. దానికి ఉండే కొమ్ములాంటి వాటితో కొబ్బరిబోండాలను ఈజీగా వలిచేస్తుంటాయి. అందులోని కొబ్బరిని తినేస్తుంటాయి. సముద్రప్రాంతాల్లో తిరిగే పీతల కంటే వాటి శరీరం చాలా పెద్దదిగా, చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తారు. ఈ రకమైన పీతలో మైదాన ప్రాంతాల్లో, కొబ్బరి చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో నివశిస్తుంటాయి. ఇక, ఆస్ట్రేలియా దీవుల్లో పీతలు భారీ సంఖ్యలో సంచరిస్తుంటాయి.
Read: మేడిన్ చైనాగా మారుతున్న ఆఫ్రికా…
క్రిస్మస్ దీవుల్లో రాకాసీ పీతలు అధికంగా సంచరిస్తుంటాయి. ఈ దీవులకు చెందిన పాల్ అనే వ్యక్తి గోల్ఫ్ క్లబ్‌లో ఒ పెద్ద పీతను చూశాడు. ఆ పీత తన గోల్ఫ్ స్టిక్‌లను బెండు పుల్లలు విరిచినట్టుగా విరిచేసింది. మూడు గోల్ఫస్టిక్‌లను విరిచేసింది. ఐరన్‌తో తయారు చేసిన బలమైన గోల్ఫ్ స్టిక్‌లను పీత విరిచేసింది అంటే దాని బలం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.