మేడిన్ చైనాగా మారుతున్న ఆఫ్రికా…

ప్ర‌పంచ దేశాల‌ను అజ‌మాయిషి చేసేందుకు చైనా ఎత్తులు వేస్తున్న‌ది.  ఇందులో భాగంగానే ప్ర‌పంచ దేశాల్లో భారీగా పెట్టుబ‌డులు పెడుతూ వాటిని చైనా దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. బీఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా పెట్టుబ‌డులు పెడుతున్న‌ది.  ముఖ్యంగా చీక‌టి ఖండం ఆఫ్రికాలో చైనా భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్టి ఆ దేశాల‌ను త‌మ‌వైపు తిప్పుకుంటోంది.  కెన్యా లోని స్టార్ టైమ్స్‌లో మీడియాలో భారీ పెట్టుబ‌డులు పెట్టింది.  అక్క‌డి మీడియాను వినియోగించుకొని చైనా త‌న ప్రాజెక్టుల‌ను గురించి ప్ర‌చారం చేసుకుంటోంది.  ఈ స్టార్ టైమ్స్ శాటిలైట్ ప్యాకేజీని అత్యంత చౌక‌గా అందిస్తున్న‌ది.  దాదాపు ఆఫ్రికాలోని 30 దేశాల్లో 2.5 కోట్ల మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు.  

Read: ఒమిక్రాన్ ‘పరేషాన్’.. ఏపీలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్

ఆఫ్రికాతో పాటు అటు ఇట‌లీ మీడియాలోనూ చైనా భారీగా పెట్టుబ‌డులు పెట్టింది.  ఇట‌లీ అధికార మీడియా ఏఎన్ఎస్ఏ తో చైనాకు చెందిన జిన్హువా ఒప్పందం చేసుకుంది.  ఈ ఒప్పందం ప్ర‌కారం ప్ర‌తిరోజూ 50 చైనా అనుకూల క‌థ‌నాల‌ను ఇట‌లీ మీడియా ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది.  సెర్బియా, చెక్ రిప‌బ్లిక్ దేశాల్లో కూడా చైనా పెట్టుబ‌డులు పెట్టింది.  క‌రోనా స‌మ‌యంలో చైనా త‌న‌కున్న మీడియా బ‌లంతో క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టింది చైనాలో కాద‌ని, ఇట‌లీలో అని చెప్పేందుకు ప్ర‌య‌త్నించింది.  అయితే, అప్ప‌టికే ప్ర‌పంచం మొత్తం ఈ వైర‌స్ చైనా నుంచే వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం కావ‌డంతో చైనా చేసిన కృషి ఫ‌లించ‌లేదు.  

Related Articles

Latest Articles