ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళాన్ని నెటిజన్లు తమదైన శైలిలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ నెటిజన్ ఇండిగో విమానం థీమ్‌లో రూపొందించిన ఆటో వెర్షన్‌ను AI సహాయంతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలో కనిపించే ఆటో నీలం, తెలుపు రంగులతో అచ్చం ఇండిగో స్టైల్లో రూపుదిద్దుకుంది. బయటకు విమానం రెక్కల్లా కనిపించే డిజైన్లు, పక్కగా ఇంజిన్‌లా స్టైల్ చేసిన బాక్స్, ముందు భాగంలో విమానం ముక్కు ఆకారాన్ని పోలిన ఫ్రంట్—మొత్తం ఆటోనే జెట్‌లా మార్చేశారు. మరీ ఫన్నీగా కనిపించిన భాగం ఏమిటంటే, ఆ ఆటో డ్రైవర్ “బోపాల్ నుంచి ముంబై, ముంబై నుంచి దుబాయ్, అక్కడి నుంచి యూకే!” అంటూ సాధారణ ఆటో డ్రైవర్ల మాదిరిగానే ప్రయాణికులను పిలుస్తూ కనిపించడం. మీటర్ రూ.10 నుంచే మొదలవుతుందనీ, కావాలంటే డైరెక్ట్ లండన్‌కి కూడా తీసుకెళ్తానని చెప్పడం చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు.
అయితే ఇది నిజం కాదు. పూర్తిగా AIతో తయారు చేసిన ఫన్ వీడియో మాత్రమే. కానీ ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఈ క్రియేటివ్ వీడియోపై నెటిజన్లు ఘాటు కామెంట్లు, నవ్వులు పూయించే స్పందనలు చేస్తున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ రద్దయినా… ఇండిగో ఆటో లైన్స్ ఇప్పటికే టేక్ ఆఫ్ అయ్యాయని కామెంట్ చేశారు. మరికొంత మంది ఇప్పుడు పైలట్ కావాలంటే DGCA ఎగ్జామ్ అవసరం లేదు… ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.లాస్ట్ కాల్ ప్యాసింజర్స్… చాయ్, సమోసా తీసుకుని ఎక్కండని ఇంకొకరు ఫన్నీగా స్పందించారు.
दुबई से डायरेक्ट अपने इंडिया 😂 pic.twitter.com/QJJtqm7tZo
— Silent Girl (@silent_girl_321) December 9, 2025