ఐఐటి ఢిల్లీ మరోమారు తన ప్రతిభను చాటుకున్నది. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు సరికొత్త సోలార్ ప్యానల్ ను రూపోందించారు. సాధారణంగా సోలార్ ప్యానల్‌లను ఒకచోట ఫిక్స్ చేస్తే అక్కడి నుంచి సోలార్‌ను గ్రహించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, సూర్యుడు ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉండడు. తూర్పు నుంచి పడమర వైపుకు పనియస్తుంటాడు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోలార్ ప్యానళ్ల ద్వారా కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటాయి.
Read: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్: అక్కడ రెండురోజులు లిక్కర్ షాపులు బంద్…
దీనికి పరిష్కారం కనుగొనేందుకు ఐఐటి ఢిల్లీ వినూత్నంగా ఆలోచించి పొద్దుతిరుగుడు మాదిరిగా సూర్యుడి గమనాన్ని అనుసరించి సోలార్ ప్యానళ్లు రొటేట్ అవుతుంటాయి. సోలార్ ప్యానళ్లు రొటేట్ కావడం వలన సూర్యుడి వేడిని మరింత గ్రహించి ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అనువుగా మారతాయని ఐఐటి ఢిల్లీ పేర్కొన్నది. త్వరలోనే ఈ రకమైన సోలార్ ప్యానళ్లను కమర్షియల్‌గా ఉత్పత్తి చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.