సాధారణ టీలతో పోలిస్తే హెర్బల్ టీలను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి ఎటువంటి టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గులాబీలను ఎక్కువ మంది ఇష్టపడతారు.. గులాబీ రేకులని చాలా మంది ఇష్టపడతారు. వీటిని వాసన చాలా బావుంటుంది. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మీ శరీర టెంపరేచర్‌ని తగ్గించడంలో గులాబీరేకులు ముందుంటాయి. ఇది ఫ్లూ టైమ్‌లో హ్యాపీ హార్మోన్స్‌ని విడదల చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అదనపు కార్టిసోల్‌ని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ వైరల్ లక్షణాలు జలుబు, ఫ్లూ సీజన్‌లో వాడడం చాలా మంచిది. దీని వల్ల మంచి నిద్ర మీ సొంతమవుతుంది. థైరాయిడ్, ఒత్తిడి, నిద్రలేమి, వాపు, మొటిమలని దూరం చేస్తుంది..
ధనియాల నీటిని తాగడం వల్ల వైరల్ ఫీవర్ లక్షణాల నుండి రిలాక్స్ అవ్వొచ్చు. ఇమ్యూనిటీని మెరుగ్గా చేస్తుంది. దీని వల్ల మీ టెంపరేచర్‌ని తగ్గిస్తుంది. జీవక్రియని పెంచుతుంది. తలనొప్పి, వాపుని తగ్గిస్తుంది..
కరివేపాకు టీ.. వంటల్లో తీసిపడేసే కరివేపాకు తో టీ చేసుకొని తాగడం వల్ల ఇది ఔషధ గుణాలను కలిగి ఎన్నో సమస్యలని దూరం చేస్తుంది. ఇది జ్వరం, అతిసారం, విరోచనాలు, వికారం, వాంతులు, రక్తహీనత, మధుమేహం, హార్మోన్ల బ్యాలెన్స్ సరిచేస్తుంది..
ఈ హెర్బల్ టీ ని ఎలా తయారు చేసుకోవాలంటే?
ధనియాలని కొద్దిగా దంచాలి, గులాబీ రేకులని కూడా దంచాలి. కరివేపాకుని ఎండబెట్టి దంచుకోవాలి. వీటన్నింటిని ఓ గ్లాసు జార్‌లో వేయాలి. టీ చేసుకోవాలనుకున్నప్పుడు ఓ కప్పున్నర నీటిలో ఓ టీ స్పూన్ ఇప్పుడు తయారు చేసుకున్న పొడిని వేసి మరుగుతున్న నీటిలో వేసి కప్పు అయ్యేవరకూ మరిగించి వడపోసి తాగడమే.. ఇకపోతే ఈ హెల్దీ డ్రింక్‌ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. భోజనానికి ఓ గంట ముందు, భోజనం తర్వాత గంటకి త్రాగడం మంచిది..
ఈ టీ వల్ల కలిగే ప్రయోజనాలు..
*. మైగ్రేన్‌ని తగ్గిస్తుంది..
*. జ్వరంని తగ్గిస్తుంది..
*. తలనొప్పి దూరం చేస్తుంది..
*. థైరాయిడ్ తగ్గుతుంది..
*. షుగర్ ఉన్నవారికి చాలా మంచిది..
*. నిద్ర సమస్యలు దూరం..
*. వాపుని తగ్గిస్తుంది..
*. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ..
*. మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది..
*. యూటీఐ తగ్గిస్తుంది..
*. ఆకలిని పెంచుతుంది..
*. జీర్ణక్రియని పెరుగుతుంది..
*. ఐబీఎస్ లక్షణాలను తగ్గిస్తుంది..
*. మీ ప్రేగు సమస్యని దూరం చేస్తుంది..
*. వైరల్ ఇన్ఫెక్షన్లు దూరం..
*. గట్‌లో చెడు బ్యాక్టీరియా దూరం..
*. యాసిడ్, గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్‌ని తగ్గిస్తుంది..
మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.