చిన్నపిల్లలు చిన్నచిన్న నాణేలను తెలియకుండా మింగేస్తుంటారు. ఇక కొంతమంది బంగారం ఇతర వస్తువులను మింగేస్తుంటారు. అయితే, బీహార్ చెందిన ఓ వ్యక్తి ఏకంగా చాయ్‌గ్లాస్‌ను మింగేశాడు. కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కడుపులో ఏదో వస్తువు ఉందని గమనించిన వైద్యులు ఎండోక్కోపీ విధానం ద్వారా పరీక్షించగా, కడుపులో గ్లాసు ఉన్నట్టు గుర్తించారు. మలద్వారం ద్వారా బయటకు తీసుకురావాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో వెంటనే ఆపరేషన్ చేసి గ్లాసును బయటకు తీశారు. అయితే ఆ వస్తువును ఎలా మింగాడు అన్నది వైద్యులకు సైతం అర్థం కాలేదు. గొంతుద్వారా అంతపెద్ద గ్లాస్ వెళ్లదని వైద్యులు చెబుతున్నారు. ఈసంఘటన బీహార్‌లోని వైశాలీ జిల్లాలోని మహువా ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం బాదితుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.
Read: TSRTC: ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్న ఆర్టీసీ బస్సులు…