Marriage Offer : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఓ విచిత్రమైన వీడియో షేక్ చేస్తోంది. ఇందులో ఓ యువతి తనకు ఓ మందుబాబు వరుడు కావాలని చెబుతోంది. అదేంటో అనే కంగారుతో వీడియో చూడగానే, ఆమె చెప్పే మాటలు విని నెటిజన్లు షాక్‌తో పాటు నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోలో యువతి బాగా కాన్ఫిడెంట్‌గా తన పెళ్లి కోరికను చెప్పింది. కానీ ఆమె పెట్టిన షరతులు వింటే ఎవరికైనా కాసేపు సైలెంట్.. ఆ తరువాత నవ్వే వస్తుంది. “నాకు తాగే వాడు కావాలి, తినే వాడు కావాలి… భలే మందుబాబు కావాలి” అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేసింది. సాధారణంగా అమ్మాయిలు మంచి లక్షణాలు ఉన్న, అలవాట్లకు దూరంగా ఉండే వాడిని కోరుకుంటారు. కానీ ఈమె మాత్రం విరుద్ధంగా, అలాంటి వాడే వద్దని స్పష్టంగా చెప్పేసింది.
Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!
ఇంతకీ ఈమె పెళ్లికావాల్సిన వాడికి ఇచ్చే కట్నం కూడా తానే చెప్పారు. 5 లక్షల రూపాయల నగదు, ఓ బుల్లెట్ బైక్, ఇంకా ‘దివానా పలాంగ్’ ఇస్తానంటూ నిశ్చయంగా చెప్పేసింది. అసలు దీనిలో నవ్వు పుట్టే విషయం ఏంటంటే, ఆమె పలాంగ్ పేరు తప్పుగా.. ‘దీవానా పలాంగ్’ అంటే పిచ్చి మంచం అని అర్థం వచ్చేలా చెప్పంది. నిజానికి అది ‘దివాన్ పలాంగ్’ అన్నమాట. ఇది గుర్తించి కొంతమంది నెటిజన్లు కామెంట్స్‌లో ఆమె తప్పును కూడా వైరల్ చేశారు.
ఈ వీడియోను @desh_bandhu_media అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయగా, రెండు రోజుల్లోనే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. పోస్ట్ కింద కామెంట్లు చూస్తే అన్నీ వెటకారంగా, జోక్స్‌తో నిండిపోయి ఉన్నాయి. “మందుబాబులు లైన్‌లో పడండి”, “నీలం డ్రమ్‌లో నన్ను పెడతారేమో నాకు భయమేస్తోంది” అంటూ కొందరు రిప్లై ఇచ్చారు.
ఈ వీడియో నిజంగా ఎవరో పెళ్లి కోసం తీసినదా, లేక కేవలం ఫన్ కోసం చేసిన వీడియోనా అన్నది క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో మాత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. ఎవరు ఏమీ అనుకున్నా.. ఆ అమ్మాయి ధైర్యం, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ చూసి చాలామంది ఓ లుక్ వేయకుండా ఉండలేరు. ఇప్పుడే మీరు కూడా చూడండి.. నవ్వు మిస్ అవకండి!
MLA Payal Shankar: ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు..