రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేస్తే ఫైన్ వేస్తారు. అయితే, అమెరికాలో పార్కింగ్ కోసం పెద్ద పెద్ద ప్రదేశాలు ఉంటాయి. కారును ఎక్కడ నిలపాలో అక్కడే పార్కింగ్ చేయాలి. కానీ, కొందరు మాత్రం సూచించిన ప్రదేశాల్లో కంటే ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. అయితే, చాలా మంది దీని గురించి పట్టించుకోరు. ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఎవరూ పట్టించుకోరు. కొందరు మాత్రం రాంగ్ పార్కింగ్ చేసిన వారికి బుద్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు.
Read: డిజిటల్ మానియా: బెగ్గర్స్ చేతిలోనూ….
సూపర్ మార్కెట్ కు వచ్చిన ఓ వ్యక్తి పార్కింగ్ ప్లేస్‌లో మెర్సిడెజ్ బెంజ్ కారును అడ్డదిడ్డంగా పార్క్ చేశాడు. కారును పార్క్ చేయాల్సిన ప్రాంతంలో కాకుండా అడ్డదిద్దడంగా పార్క్ చేయడం వలన ఆగ్రహించిన వ్యక్తులు ఆ కారుకు అడ్డంగా ట్రాలీలను పేర్చారు. దీంతో ఆ కారును బయటకు తీసేందుకు వీలు లేకుండా పోయింది. అంతేకాదు, కారును అడ్డదిడ్డంగా పార్క్ చేసినందుకు బూతులు తిడుతూ నేలపై రాశారు. దీనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇలా చేయడం తగదని విమర్శలు చేస్తున్నారు.