Elephant Stops Sugarcane Van On Road: జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. రోడ్డు మీద వెళ్తున్న ఓ ట్రక్కును ఏనుగు ఆపి మరీ దానికి కావాల్సిన చెరుకుగడలను తీసుకుంది. మామూలుగానే ఏనుగులకు చెరకుగడలు అంటే అమితమైన ఇష్టం.. ఇక అవి కనిపిస్తే ఊరుకుంటాయా..? ఈ ఏనుగు కూడా అంతే.. చెరకుగడలు కనిపించే సరికి రోడ్డు మీద వెళ్తున్న ట్రక్కును అడ్డంగా ఆపేసి మరీ.. దానికి కావాల్సిన చెరకుగడలను తీసుకుంది.
Shubman Gill: రష్మిక.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకి ది టోల్ ట్యాక్స్ కలెక్టర్ అనే క్యాప్షన్ జత చేయడంతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిన్న క్లిప్ లో.. ఒక ఏనుగు రోడ్డు మధ్యలో ట్రక్కును ఆపి.. దాని నుంచి చెరకుగడలను తీసుకుని ఎంజాయ్ చేస్తూ తినింది. ప్రస్తుతం ఈ వీడియోను సుమారు రెండు లక్షలకు పైగా వీక్షించారు.. వెయ్యి మందికి పైగా రీట్వీట్లు, ఆరు వేలకు పైగా లైక్ లు వచ్చాయి. ఏనుగు ట్రక్కును ఆపిన విధానంపై నెటిజన్లు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు. ఏనుగు కోసం ట్రక్కు డ్రైవర్ల వెహికిల్ ఆపడంతో నెటిజన్లను ఈ వైరల్ వీడియో మరింత ఎక్కువగా ఆకట్టుకుంటుంది.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు.. న్యూక్లియర్ ప్లాంట్‌లో నిలిచిన విద్యుత్..