ఈ మధ్యకాలంలో కల్చర్ పేరుతో మద్యం సేవించే యువత సంఖ్య పెరుగుతోంది. తాగడం వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, మత్తుకు లోనై రోడ్లపై హంగామా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీ లోని ఒక నైట్‌క్లబ్‌లో ఓ యువతి అధికంగా మద్యం తాగింది. అనంతరం ఇంటికి వెళ్లడానికి రాపిడో బైక్ బుక్ చేసుకుంది. మత్తు ఎక్కువగా ఉండడంతో బైక్‌పై సరిగ్గా కూర్చోలేకపోయన యువతి.. వెంటనే ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆమె పరిస్థితిని గమనించిన రాపిడో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా పంచుకోబడుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మద్యం సేవించడం వ్యక్తిగతమైనా, స్పృహ లేని పరిస్థితిలో రోడ్లపైకి రావడం ప్రమాదకరమని, ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న ఈ మద్యం సంస్కృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు తమకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Is this the freedom we are fighting for? She is so drunk after clubbing that she can't even handle herself.
At least think about your parents before going this far 🤦🏻♀️ pic.twitter.com/rMVCj5cENM— Snehal 🕊️ (@Snehalsays_03) December 8, 2025