Rahul Khanna Naked Photo in social media: కేంద్ర మాజీ మంత్రి వినోద్ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఫేమస్ అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు రాహుల్ ఖన్నా మాత్రం సినిమా ఇండస్ట్రీలో అనుకున్న రీతిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాహుల్ ఖన్నా తన టాలెంట్ చూపించాడు. అయితే లైమ్‌లైట్‌లోకి మాత్రం రాలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని భావించినట్లు ఉన్నాడు. అందుకే నగ్నంగా ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ మేరకు సోఫాలో బట్టలు లేకుండా నగ్నంగా కూర్చుని ఫోటో దిగాడు. ప్రైవేట్ పార్టు కనిపించకుండా దిండు అడ్డం పెట్టుకున్నాడు. ‘నేను ఇప్పటివరకు చాలా రహస్యంగా ఉంచాను. కానీ ఇక దాన్ని బయటపెట్టే సమయం వచ్చింది. నేను రివీల్ చేసే అతిపెద్ద విషయం కోసం వేచి ఉండండి’ అంటూ సదరు పోస్టులో రాహుల్ ఖన్నా రాసుకొచ్చాడు.
So, there’s something I’ve been keeping under wraps—but it’s now time to share! Join me tomorrow for the big reveal? 🎁 pic.twitter.com/8AOD90ZugF
— Rahul Khanna (@R_Khanna) July 17, 2022
అయితే రెండు రోజుల క్రితం రాహుల్ ఖన్నా పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసిన నెటిజన్‌లు తీవ్రస్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి పబ్లిక్ డోమైన్‌లో అలాంటి ఛండాలమైన పనులు చేయకు అంటూ రాహుల్ ఖన్నాకు కామెంట్లు పెడుతున్నారు. ఇలా అర్థనగ్నంగా ఫోజులివ్వడం ఓకే అయితే సిగ్గు పడాల్సిన అవసరం ఏముంది. ఇక అన్ని బహిరంగంగానే చేయండి అంటూ మరో నెటిజన్ సెటైర్ వేశారు. దయచేసి దిండు కింద ఏం ఉందో రేపు మాత్రం బయట పెట్టవద్దు అంటూ మరో యూజర్ స్పందించాడు. పురుషులకు సంబంధించిన దుస్తులను ప్రమోట్ చేయడంలో భాగంగా రాహుల్ ఖన్నా ఈ ఫొటోను షేర్ చేసినట్లు స్పష్టమైంది. ఎందుకంటే తర్వాతి రోజు తన ట్విట్టర్‌లో ఫార్మల్ డ్రెస్‌లో స్విమ్మింగ్ పూల్‌లో ఓ బొమ్మపై కూర్చున్న ఫొటోను రాహుల్ ఖన్నా షేర్ చేశాడు.
It’s the X I’ve been keeping under wraps!
Thrilled to introduce RKXC—my collaboration with @ChokoreIndia.
The #RKXC line offers the foundation blocks on which the modern Indian person can build a world-class accessories collection.
Link in bio!#RahulKhannaXChokore pic.twitter.com/dhqcDkh7wQ
— Rahul Khanna (@R_Khanna) July 18, 2022