మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఒక్కసారిగా విష సర్పం బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.