తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్‌లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.