ఓ మూడేళ్ల పిల్లాడు ఏకంగా 18వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందికి పడిపోయాడు. అయినా ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో కుటుంబీకుల్లో సంతోషం వెల్లువిరిసింది. ఇంతకీ ఆ బాలుడి ప్రాణాలు ఎవరు కాపాడారో తెలుసా? మనుషులు కాదు.. ఓ వృక్షం. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.