బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.. ఒక్క నార్త్ లోనే కాదు.. సౌత్ లో కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈరోజు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సల్లూభాయ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇప్పటివరకు యాక్షన్ హీరోగా మాత్రమే అందరికీ పరిచయం.. కానీ చాలా మందికి తెలియని ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు.. అద్భుతమైన కళాకారుడు. పెయింటింగ్ పట్ల అతనికి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇప్పటివరకు అనేకరకాల పెయింటింగ్స్ వేసి శభాష్ అనిపించుకున్నాడు.. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. కేవలం చేతివేళ్లతోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తుంటారు సల్మాన్. పన్వెల్ లోని తన ఇంటిలో ఎన్నోరకాల పెయింటింగ్స్ వేశాడు సల్మాన్.
అతను సృష్టించిన ప్రతి ఆర్ట్ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. గతంలో సల్మాన్ వేసిన పెయింటింగ్స్ కోట్లలో అమ్ముడయ్యాయి. తన సోదరి అర్పితా ఖాన్, బావ ఆయుష్ శర్మకు ఖురాన్ నుంచి ఓ అందమైన కళాకృతిని చేతివేళ్లతో పెయింటింగ్ చేశాడు.. అలా ఎన్నో చిత్ర ఖండాలను రూపొందించారు.. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు సల్మాన్. అలాగే ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నాడు. చివరిసారిగా సల్మాన్ టైగర్ 3 చిత్రంలో కనిపించాడు.. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్ లపై సైన్ చేశారని తెలుస్తుంది..