Today Business Headlines 16-12-22: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. మెట్రో రైల్ మరియు రైల్వే స్టేషన్లు, పెద్ద బస్టాండ్ వంటి ప్రధాన రవాణా ప్రదేశాల్లో పొందొచ్చని తెలిపింది. అన్ని రకాల 5జీ ఫోన్లలో సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్‌తోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.
International Trade Prospects: అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలకు సంబంధించి.. వరల్డ్‌లోని టాప్-10 ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా.. ది బెస్ట్ ఎకనామీ అని ‘‘ఎస్ అండ్ పీ’’ గ్లోబల్ మార్కెట్ ఇంటలిజెన్స్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండదని తెలిపింది. ఈ మేరకు లేటెస్ట్‌గా గ్లోబల్ ట్రేడ్ మానిటర్ రిపోర్టును విడుదల చేసింది.
Coca Cola Sprite: మన దేశ మార్కెట్‌లో కోకాకోలా స్ప్రైట్ కూల్‌డ్రింక్.. స్పెషల్ ఫీట్‌ను సాధించింది. ఒక బిలియన్ (వంద కోట్ల) డాలర్ల బ్రాండ్‌గా ఎదిగింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో భారత మార్కెట్‌లో స్ప్రైట్ సేల్స్ భారీగా పెరిగాయని కోకాకోలా వెల్లడించింది. సాఫ్ట్ డ్రింక్‌లు మరియు ఫ్రూట్ డ్రింక్ మాజా విక్రయాలు సైతం దీనికి కారణమయ్యాయని పేర్కొంది. కోకాకోలాకే చెందిన సాఫ్ట్ డ్రింక్ థమ్సప్ పోయినేడాదే బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.