ఆసక్తికరంగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా ఐపీఎల్ 2020 లో తలపడిన మ్యాచ్ ను ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఐపీఎల్ లోనే మొదటిసారిగా ఆ రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఆ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ కి సూపర్ ఓవర్ కు సంబంధించిన రూల్ నే మార్చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లో మూడు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ రెండు విజయాలతో నాలుగో స్థానములో ఉన్న ముంబై పై ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంటుంది. కానీ ముంబై విజయం సాధించిన అదే 4వ స్థానములో ఉంటుంది. ఇక ప్రస్తుతం రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ ల ప్రకారం చూస్తే పంజాబ్ బౌలింగ్ లో సతమతమవుతుండగా ముంబై బ్యాటింగ్ లో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఈ రెండు జట్లు ఎలా రాణిస్తాయి అనేది.