ఐపీఎల్ 2021 లో మొదటిసారిగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ గత మ్యాచ్ లో ఓడిన కేకేఆర్ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని అనుకుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
కోల్‌కత : నితీష్ రానా, శుబ్‌మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్