అవును! మీరు చదువుతున్నది నిజమే! పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే నెటిజన్లకు ఓ పెద్ద మెత్తని కౌగిలింతను ఇచ్చేసింది. కంగారు పడకండి… అది డిజిటల్ మీడియా ద్వారానే! నెటిజన్ల మీద పూజా హెగ్డేకు అంత ప్రేమ కలగడానికి కారణం లేకపోలేదు. ఇన్ స్టాగ్రామ్ లో పూజా హెగ్డే ను ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య బుధవారంతో 13.1 మిలియన్ కు చేరింది. దాంతో తనను ఫాలో అవుతున్న వాళ్ళను లవ్లీస్ అంటూ సంభోదించి, వాళ్ళకు ఓ పెద్ద మెత్తని కౌగిలిని, తీయని ముద్దును ఇచ్చేసింది. మరి ఈ అందాల భామ గ్లామరస్ స్టిల్స్ కోసం, మూవీ అప్ డేట్స్ కోసం ఇంకెంత మంది రాబోయే రోజుల్లో ఫాలో అవుతారో చూడాలి!